చంద్రబాబుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ

ABN , First Publish Date - 2020-12-19T22:24:02+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై వల్లభనేని వంశీ మండిపడ్డారు. టీడీపీ జాతీయ పార్టీ అని ఎవరు ప్రకటించారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌ జాతీయ నాయకులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. చంద్రబాబు పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. రాజధాని ఎక్కడ పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని వల్లభనేని వంశీ అన్నారు.


Read more