వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణరథం ఊరేగింపు: టీటీడీ
ABN , First Publish Date - 2020-12-18T01:16:45+05:30 IST
వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణరథం ఊరేగింపును కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో టీటీడీ మహిళా ఉద్యోగులతో స్వర్ణరథాన్ని ఊరేగిస్తారు.

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణరథం ఊరేగింపును కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో టీటీడీ మహిళా ఉద్యోగులతో స్వర్ణరథాన్ని ఊరేగిస్తారు. పేర్లు నమోదు చేసుకోవాలంటూ మహిళా ఉద్యోగులకు టీటీడీ సర్క్యులర్ ఇచ్చింది. కోవిడ్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చిన వారికే రథం లాగేందుకు దేవస్థానం అనుమతిచ్చింది. భక్తులు స్వర్ణరథం లాగేందుకు అనుమతి నిరాకరించారు. భక్తులు గ్యాలరీ నుంచి స్వర్ణ రథోత్సవాన్ని తిలకించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన శ్రీవారి బ్రహోత్సవాలల్లో స్వర్ణరథ ఊరేగింపును రద్దు చేశారు. సాధారణంగా ఈ సమయంలో స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగింపు జరగాల్సి ఉంది. అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో స్వర్ణరథాన్ని రద్దు చేసి ఆ స్థానంలో సర్వభూపాల వాహనసేవను ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.