ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ సస్పెన్షన్

ABN , First Publish Date - 2020-12-28T01:38:24+05:30 IST

ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్‌రావును మున్సిపల్‌శాఖ

ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ సస్పెన్షన్

విజయవాడ: ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్‌రావును మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్ కుమార్ సస్పెండ్ చేశారు. బ్యాంక్ ఎదుట చెత్త వేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లను మున్సిపల్‌శాఖ కమిషనర్ వివరణ కోరింది. కృష్ణాజిల్లా ఉయ్యూరుతో పాటు విజయవాడ నగరంలో 16 బ్యాంకు శాఖల ముందు చెత్త వేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలివ్వడానికి కొన్ని బ్యాంకులు ముందుకు రావడంలేదు. దీనికి నిరసనగా అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఉయ్యూరు కమిషనర్‌ ఒక అడుగు ముందుకేసి పీఎం స్వానిధి, జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత పథకాలను రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఈ విధంగా చెత్తను వేసినట్టుగా బ్యాంకు గేట్లకు ప్రత్యేకంగా తన పేరుతో బోర్డులు పెట్టించారు.

Updated Date - 2020-12-28T01:38:24+05:30 IST