జల వివాదాలకు చర్చలే పరిష్కారం

ABN , First Publish Date - 2020-10-07T10:06:12+05:30 IST

తరచూ చర్చల ద్వారానే ఏపీ, తెలంగాణల మధ్య జలవివాదాలకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ అభిప్రాయపడ్డారు. ఏడాదికోసారి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ

జల వివాదాలకు చర్చలే పరిష్కారం

ఏటా అపెక్స్‌ కౌన్సిల్‌: షెకావత్‌ 


న్యూఢిల్లీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తరచూ చర్చల ద్వారానే ఏపీ, తెలంగాణల మధ్య జలవివాదాలకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ అభిప్రాయపడ్డారు. ఏడాదికోసారి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ జరగాలని ఆకాంక్షించారు. మంగళవారం తన అధ్యక్షత న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి న దీ యాజమాన్య సంస్థల పరిధులను నోటిఫై చేసే అంశంపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాని కారణంగా గత ఆరేళ్లుగా ఇది పెండింగ్‌లో ఉందని చె ప్పారు. వీటిని నోటిఫై చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంగీకరించలేదన్నారు. అయితే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నోటిఫై చేయడానికి ఏకాభిప్రాయం అవసరం లేదని, కేంద్రం నోటిఫై చేయొచ్చని కేసీఆర్‌ కు కూడా తెలియజేశానని, దాంతో ముందుకెళ్లాలని ఆయన చెప్పారని వెల్లడించారు. అన్ని కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌, డిజైన్లను రెండు రాష్ట్రాలు తమకు అందించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తక్కువ సమయంలో సాంకేతిక అప్రైజల్‌ చేస్తామని హామీ ఇ చ్చినట్లు చెప్పారు. కాగా, రీయింబర్స్‌ పద్ధతిలో పోలవ రం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తున్నామని,  బిల్లులన్నీ క్లియర్‌ చేశామని చెప్పారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో పోలవరం సందర్శిస్తానన్నారు.

Read more