విజయవాడలో నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ

ABN , First Publish Date - 2020-10-07T23:13:56+05:30 IST

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ తగిలింది. కేంద్రమంత్రి కాన్వాయ్‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మానవహక్కుల సెల్ అధ్యక్షుడు రాజశేఖర్

విజయవాడలో నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ

విజయవాడ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ తగిలింది. కేంద్రమంత్రి కాన్వాయ్‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మానవహక్కుల సెల్ అధ్యక్షుడు రాజశేఖర్ అడ్డుకున్నారు. వ్యవసాయ అనుబంధ చట్టాలు ఉపసంహరించుకోవాలంటూ  డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రాజశేఖర్‌ను అరెస్ట్ చేశారు.


మరోవైపు ఏపీ రైతు సంఘ, ఏపీ వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, ప్రజా సంఘాలు, ఐక్య వేదిక ఆధ్వర్యంలో కూడా నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. బీజేపీ దుర్మార్గ  వైఖరిని ఎండగడతామన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రామకృష్ణ, సీపీఎం బాబురావును అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండిపడ్డారు. వ్యవసాయదారులతో చర్చించిన తర్వాతే చట్టాలు అమలు చేయాలన్నారు. కానీ చట్టాలు అమలు చేశాక వ్యవసాయదారులతో చర్చలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బిల్లుల చట్టాలు రద్దు చేసేవరకు పోరాడతానే ఉంటామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి.

Read more