-
-
Home » Andhra Pradesh » Union Minister Kishan Reddy
-
రాష్ట్రంలో అభివృద్ధి వ్యతిరేక పాలన
ABN , First Publish Date - 2020-06-23T09:08:13+05:30 IST
‘‘ఏపీలో అభివృద్ధి వ్యతిరేక, పోలీస్ పాలన నడుస్తోంది. అవినీతి, అహంకారం, అబద్ధాలు రాజ్యమేలుతున్నా యి.

- చెలరేగుతున్న మద్యం, ఇసుక, భూ మాఫియా
- పోలీసుల వేధింపులపై ఫిర్యాదులు
- నత్తనడకన పోలవరం ప్రాజెక్టు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీలో అభివృద్ధి వ్యతిరేక, పోలీస్ పాలన నడుస్తోంది. అవినీతి, అహంకారం, అబద్ధాలు రాజ్యమేలుతున్నా యి. మద్యం, ఇసుక, భూ మాఫియాలు చెలరేగుతున్నాయి. అరాచకాలు, దౌర్జన్యాలకు అడ్డే లేకుండా పోతోంది’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. జనసంవేద్ వర్చువల్ ర్యాలీలో సోమవారం ప్రసంగించారు. కేంద్రం ఏడాది పాలనలో సాధించిన విజయాలు వివరిస్తూ.. రాష్ట్రంలో వైసీపీ పాలనలోని లోపాలను తీవ్ర పదజాలంతో ఎ త్తిచూపారు. పోలీసులే తమను వేధిస్తున్నారంటూ కేంద్రానికి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంద ని, నిధులతోపాటు కేంద్ర సంస్థలు కేటాయించి ప్రేమను చాటుకుందన్నా రు. పోలవరానికి వంద శాతం నిధులు కేంద్రమే ఇస్తున్నా నత్తనడకన సా గుతోందని పెదవి విరిచారు. ఎంతమంది సీఎంలు వచ్చినా రాయలసీమకు న్యాయం చేయలేదన్నారు.
ప్రధాన సేవకుడిగా మోదీ: కన్నా
‘‘నరేంద్ర మోదీ దేశానికి ప్రధానిగా కాకుండా ప్రధాన సేవకుడిగా పని చేస్తున్నారు. పేదరికం నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, ఉద్యోగ కల్పన, సంక్షేమంలో అలుపెరుగని ధీరునిలా పని చేస్తున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు.