శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్
ABN , First Publish Date - 2020-10-03T15:14:39+05:30 IST
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షఖావత్, ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మిధున్ రెడ్డి తిరుమల..

తిరుమల: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షఖావత్, ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మిధున్ రెడ్డి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వారు వీఐపీ బ్రేక్ ప్రారంభదర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశం, ప్రపంచానికి కరోనా నుంచి త్వరగతిన విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్దించినట్లు మంత్రి గజేంద్ర సింగ్ తెలిపారు.