దేశ ప్రగతిలో నిట్ భాగస్వామ్యం
ABN , First Publish Date - 2020-10-28T09:05:52+05:30 IST
‘దేశం మేకిన్ ఇండియా దిశగా ముందుకు సాగుతోంది. ఈ ప్రగతిలో ఏపీ నిట్ భాగస్వామ్యం కావాలి’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్

కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోక్రియాల్ పిలుపు
తాడేపల్లిగూడెం నిట్‌లో భవనాల ప్రారంభం
తాడేపల్లిగూడెం రూరల్, అక్టోబరు 27: ‘దేశం మేకిన్ ఇండియా దిశగా ముందుకు సాగుతోంది. ఈ ప్రగతిలో ఏపీ నిట్ భాగస్వామ్యం కావాలి’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో రూ.210 కోట్లతో నిర్మించిన భవనాలను మంగళవారం ఆయన ఢిల్లీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. బాలుర, బాలికల వసతి భవనాలు, అతిథిగృహం, లైబ్రరీ కాంప్లెక్స్, అకడమిక్ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ తక్కువ సమయంలోనే నిట్ ప్రగతి సాధించిందని, మరిన్ని మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో విద్యా రంగానికి సీఎం జగన్ ఆధ్వర్యంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం నిట్ చైర్‌పర్సన్ మృదులా రమేశ్, డైరెక్టర్ సీఎ్‌సపీ రావు, రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి మాట్లాడారు.