టీవీ-5 కార్యాలయంపై దాడి

ABN , First Publish Date - 2020-05-10T09:58:49+05:30 IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని టీవీ-5 న్యూస్‌ చానల్‌ ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు.

టీవీ-5 కార్యాలయంపై దాడి

  • జనసేన, సీపీఐ అగ్ర నేతల ఖండన


బంజారాహిల్స్‌, హైదరాబాద్‌, అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని టీవీ-5 న్యూస్‌ చానల్‌ ప్రధాన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. శుక్రవారం రాత్రి దుండగులు రాళ్లు విసరడంతో, కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యేలోగా వారు పారిపోయారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో టీవీ-5పై దాడిని ఖండించారు.

చానల్‌పై దాడిని ఖండించిన చంద్రబాబు

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని టీవీ 5 కార్యాలయంపై కొందరు దుండగులు అర్థరాత్రి వేళ దాడికి పాల్పడటాన్ని చంద్రబాబు ఖండించారు. శనివారం ఆ మేరకు ట్వీట్‌ చేశారు. ‘‘మీడియా తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకొనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగింది. అధికారులు వీలైనంత త్వరగా దీనికి కారకులైన వారిని గుర్తించి అరెస్టు చేయాలి’’ అని చంద్రబాబు కోరారు.

Updated Date - 2020-05-10T09:58:49+05:30 IST