యాభై ఏళ్లుగా ఏకగ్రీవమే

ABN , First Publish Date - 2020-03-13T09:06:49+05:30 IST

విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని చింతలవలస, ఇద్దనవలస పంచాయతీలు సుమారు 50 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. అప్పటి నుంచి సర్పంచ్‌, వార్డుమెంబర్‌ స్థానాలకు ఒక్క పర్యాయం కూడా ఈ గ్రామాల్లో...

యాభై ఏళ్లుగా ఏకగ్రీవమే

  • ఆదర్శ గ్రామాలు చింతలవలస, ఇద్దనవలస


విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని చింతలవలస, ఇద్దనవలస పంచాయతీలు సుమారు 50 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. అప్పటి నుంచి సర్పంచ్‌, వార్డుమెంబర్‌ స్థానాలకు ఒక్క పర్యాయం కూడా ఈ గ్రామాల్లో పోలింగ్‌ జరగలేదు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ గ్రామస్థులంతా సమావేశమై సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకాభిప్రాయంతో నిర్ణయిస్తారు. గ్రామంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా పంచాయితీ ఎన్నికలోచ్చేసరికి అందరిదీ ఒకేమాట. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. అయితే ఇదంతా పంచాయతీ ఎన్నికల వరకే. మిగతా ఏ ఎన్నికలైనా ఎవరి పార్టీ వారిదే. ఈసారి సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికలు ఒకే సారి జరుగుతుండటంతో ఆ ఆదర్శం కొనసాగుతుందో! లేదో! చూడాలి. - మెంటాడ

Updated Date - 2020-03-13T09:06:49+05:30 IST