-
-
Home » Andhra Pradesh » ugadi effect on resurvey of lands to poor
-
రీ సర్వేపై ‘ఉగాది’ ఎఫెక్ట్... నేడు సమీక్ష
ABN , First Publish Date - 2020-03-13T11:05:59+05:30 IST
ఉగాదికి పేదలకు మంజూరు చేయనున్న ఇళ్ల స్థలాల కోసం భూముల అన్వేషణలో రెవెన్యూ, సర్వే యంత్రాంగం నిమగ్నమవ్వడంతో రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు దాదాపుగా నిలిచిపోయినట్లు...

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఉగాదికి పేదలకు మంజూరు చేయనున్న ఇళ్ల స్థలాల కోసం భూముల అన్వేషణలో రెవెన్యూ, సర్వే యంత్రాంగం నిమగ్నమవ్వడంతో రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు దాదాపుగా నిలిచిపోయినట్లు తెలిసింది. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభా్‌షచంద్రబోస్ ఫిబ్రవరి 18న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో పైలెట్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రీ సర్వే అంశంతోపాటు పైలెట్ ప్రాజెక్టుపై శుక్రవారం ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం వద్ద సమీక్ష జరగనుంది.