మరో రెండు విగ్రహాలు ధ్వంసం

ABN , First Publish Date - 2020-10-07T10:28:19+05:30 IST

రాష్ట్రంలో మరో రెండు విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో

మరో రెండు విగ్రహాలు ధ్వంసం

నరసరావుపేటలో సరస్వతీదేవి, ఆదోనిలో ఆంజనేయస్వామి


నరసరావుపేట, ఆదోని, అక్టోబరు 6: రాష్ట్రంలో మరో రెండు విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీదేవి, కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేశారు. నరసరావుపేటలోని ఎల్‌ఐసీ కార్యాలయ సమీపంలో గతంలో కృష్ణవేణి కళాశాలను నిర్వహించిన ప్రైవేట్‌ స్థలంలో సరస్వతీదేవి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ధ్వంసమైన దృశ్యాలు మంగళవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. విగ్రహంపై మద్యం సీసాలను ధ్వంసం చేసిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదని నిర్ధారించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్త ను బంగారు వైసీపీ నేత విజయ కుమార్‌ ఖండించారు.


దుండగులను పట్టుకుంటాం: డీఎస్పీ

కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓవర్‌ బ్రిడ్జి కింద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి చొరబడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. విగ్రహం ధ్వంసమైనట్లు మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అన్ని కోణాల్లో విచారించి దుండగులను కచ్చితంగా పట్టుకుంటామని డీఎస్పీ వినోద్‌ కుమార్‌, తెలిపారు. 

Read more