బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-08-18T15:17:40+05:30 IST

అనంతపురం: బెళుగుప్ప మండలం కాలువపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి

అనంతపురం: బెళుగుప్ప మండలం కాలువపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని టమాటా లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో టమాటాలను మార్కెట్‌కు తీసుకువెళ్తున్న విరుపాక్షి, మల్లికార్జున అనే ఇద్దరు రైతులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Updated Date - 2020-08-18T15:17:40+05:30 IST