ఏలూరు బాధితుల్లో మరో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-12-10T15:17:33+05:30 IST

ఏలూరు బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వింత వ్యాధితో మొత్తం 3కు మృతుల సంఖ్య చేరింది. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ

ఏలూరు బాధితుల్లో మరో ఇద్దరు మృతి

అమరావతి: ఏలూరు బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వింత వ్యాధితో మొత్తం 3కు మృతుల సంఖ్య చేరింది. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మృతి చెందారు. ఏలూరులో వింత వ్యాధికి గురై పరిస్థితి విషమించడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో 30 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో సుబ్బరావమ్మ(56), అప్పారావు(50) మృతి చెందారు. సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు చెబుతున్న వైద్యులు చెబుతున్నారు.


మరోవైపు ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం రాత్రి నుంచి కొత్త కేసులు నమోదు కాలేదు. ఇప్పటివరకు మొత్తం 592 కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి కోలుకుని 511 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏలూరు వాసులకు వింత రోగం సృష్టించిన భయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏం తాగాలన్నా.. తినాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. వణికిస్తున్న ఈ వ్యాధిని గుర్తించి, ఎప్పుడు అంతం చేస్తారోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఏలూరు మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్‌ స్థాయిగా ఈ మధ్యనే ఎదిగింది. సమీప గ్రామాలు విలీనం అవుతుండటంతో నగర జనాభా నాలుగు లక్షలకు చేరింది.

Updated Date - 2020-12-10T15:17:33+05:30 IST