విజయవాడ: నడిరోడ్డుపై ప్రత్యక్షమైన రెండు తలల పాము

ABN , First Publish Date - 2020-10-28T05:30:00+05:30 IST

విజయవాడలోని నడిరోడ్డుపై రెండు తలల పాము ప్రత్యక్షమైంది.

విజయవాడ: నడిరోడ్డుపై ప్రత్యక్షమైన రెండు తలల పాము

విజయవాడ: నగరంలోని నడిరోడ్డుపై రెండు తలల పాము ప్రత్యక్షమైంది. గురువారం ఉదయం వాకింగ్‌కు వెళ్లినవారు ఆ పామును గమనించారు. ఈ సందర్భంగా జువాలజీ లెక్చరర్ ధూళిపాల శ్రీనివాసరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇది చాలా అరుదుగా కనిపిస్తుందని, రెండు తలల పామును స్మగ్లర్స్ ఎక్కువ డబ్బులకు అమ్ముతుంటారని తెలిపారు. ఈ పాము ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని భావిస్తూ చాలామంది వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకుంటారని చెప్పారు.


ఈ పాము ప్రజలకు ఎలాంటి హాని చేయదని, కీటకాలు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటుందని శ్రీనివాసరావు తెలిపారు. పాము కనిపించగానే డీఎఫ్‌వోకు ఫోన్ చేశామన్నారు. అటవీశాఖ అధికారులు స్పందించకపోవడంతో మీడియాకు సమాచారం ఇచ్చాన్నారు. ఈ పాముకు ప్రజలు హాని చేయకముందే కాపాడాలని శ్రీనివాసరావు కోరారు.

Updated Date - 2020-10-28T05:30:00+05:30 IST