కరోనాపై పోరాటానికి టీవీఎస్ మోటార్ కంపెనీ డీలర్స్ చేయూత

ABN , First Publish Date - 2020-04-15T23:24:31+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో.. మేమున్నామంటూ టీవీఎస్ మోటార్స్ కంపెనీ డీలర్లు ముందుకొచ్చారు.

కరోనాపై పోరాటానికి టీవీఎస్ మోటార్ కంపెనీ డీలర్స్ చేయూత

తిరుపతి: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో.. మేమున్నామంటూ టీవీఎస్ మోటార్స్ కంపెనీ డీలర్లు ముందుకొచ్చారు. స్థానిక ప్రజల ఆరోగ్యం, జీవనానికి భరోసా ఇచ్చేందుకు పలు జిల్లాల్లో టీవీఎస్ డీలర్లు సహాయచర్యలు చేపట్టారు. తిరుపతిలో టీవీఎస్ కంపెనీ ప్రధాన డీలర్ కేశ్విన్ ఆటోమోటివ్స్ అయితే ఇంటింటికీ వెళ్లి కూరగాయలు సరఫరా చేస్తున్నారు. కర్నూలులోని అపర్ణ ఆటోమోటివ్స్.. రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రజలకు రాత్రిపూట భోజనాలు సరఫరా చేస్తోంది. కడియంలోని గోదావరి మోటార్స్ స్థానికంగా ఉన్నటువంటి వెయ్యిమందికి కూరగాయల ప్యాకెట్లు అందజేసింది.

Updated Date - 2020-04-15T23:24:31+05:30 IST