-
-
Home » Andhra Pradesh » Tungabhadra river
-
తుంగభద్ర నదిలో తగ్గిన నీటి ప్రవాహం
ABN , First Publish Date - 2020-11-21T14:54:34+05:30 IST
తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం తగ్గింది. నదీ స్నానాలు చేసేందుకు..

కర్నూలు: తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం తగ్గింది. నదీ స్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా తుంగభద్ర నదీ పుష్కరాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సంకల్‌బాగ్ ఘాట్‌లో ప్రారంభించారు. లక్షలాది భక్తజనం కోసం జిల్లాలో 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలో వీఐపీ పుష్కర ఘాట్‌తో పాటు 7 ఘాట్లు ఏర్పాటు చేశారు. కొవిడ్-19 నిబంధనల మేరకు నదిలో అధికారులు స్నానాలకు అనుమతి ఇవ్వలేదు. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానం చేసి పూజలు, పిండ ప్రదానాలు చేసుకోడానికి ఏర్పాటు చేశారు. పుష్కరాల్లో నదీ స్నానం లేకుండా పిండ ప్రదానాలు ఎలా చేస్తారని పండితులు ప్రశ్నిస్తున్నారు. కాగా అధికారులు మాత్రం ఘాట్ల వద్ద షవర్‌బాత్‌లు, వైద్య శిబిరాలు, ఈ టాయిలెట్స్ సిద్ధం చేశామని తెలిపారు.