పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర, కృష్ణా నదులు
ABN , First Publish Date - 2020-08-16T16:59:23+05:30 IST
తుంగభద్ర, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.

తుంగభద్ర, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి. తుంగభద్ర జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరింది. దీంతో తుంగభద్ర బోర్డు అధికారులు ప్రాజెక్టు స్పీల్‌వే 8 గేట్లు ఎత్తి తుంగభద్ర నదిలోకి నీరు విడుదల చేశారు. తుంగభద్ర పరవళ్లను చూసేందుకు కర్ణాటక వాసులు డ్యామ్ వద్దకు భారీగా తరలి వచ్చారు.
తుంగభద్ర జలాశయం పూక్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1631.62 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ110.85 టీఎంసీలైతే.. ప్రస్తుత నీటి నిల్వ 95.60 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 49,073 క్యూసెక్కులు.. అవుట్‌ఫ్లో 6,963 క్యూసెక్కులు.. జలాశయం నుంచి విడుదలైన నీళ్లు సుంకేసుల ప్రాజెక్టుకు చేరుకోవడంతో సుంకేసుల డ్యామ్ ఒక గేట్‌ను లిఫ్ట్ చేసి 2,800 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు.