సీఎం సొంత జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయి: తులసీరెడ్డి

ABN , First Publish Date - 2020-12-30T16:09:03+05:30 IST

తులసీరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సీఎం సొంత జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయి: తులసీరెడ్డి

కడప: ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ తులసీరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం సొంత ఇలాకా కడప జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి దాపురించిందని విమర్శించారు. జగన్ అరాచక పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందన్నారు. జగన్ సొంత ఇలాకా పులివెందుల్లోనే హత్యలు, అత్యాచారాలు జరిగితే పట్టించుకునే దిక్కే లేదన్నారు. ‘‘జగన్మోహన్ రెడ్డీ.. నీకు శాంతి భద్రతలు కాపాడే శక్తి లేనప్పుడు సీఎం కుర్చీ నుంచి వెంటనే  దిగిపో..మీ వైసీపీ శ్రేణులు చేసే అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారందరిని ధారుణంగా చంపుకుంటూ పోతారా’’అని తులసీరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Updated Date - 2020-12-30T16:09:03+05:30 IST