అన్యాయం, ద్రోహం: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-11-04T03:29:21+05:30 IST
పోలవరం రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన వరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. సెక్షన్ 90 ద్వారా నాటి మన్మోహన్ ప్రభుత్వం..పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి...
కడప: పోలవరం రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన వరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. సెక్షన్ 90 ద్వారా నాటి మన్మోహన్ ప్రభుత్వం..పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి చట్టబద్ధత కల్పించిందని ఆయన గుర్తు చేశారు. పోలవరం 100 శాతం కేంద్ర నిధులతో పూర్తిచేయాలన్నారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం అన్యాయం, ద్రోహమని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.