వీధి రౌడీల్లా ప్రవర్తించారు: తులసీరెడ్డి

ABN , First Publish Date - 2020-06-19T20:56:31+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఏపీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రత కోసం

వీధి రౌడీల్లా ప్రవర్తించారు: తులసీరెడ్డి

కడప: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఏపీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటాన్ని తప్పుపట్టారు. ఎన్నడూ లేని విధంగా నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ జరిగిన తీరుతెన్నులపై తులసీరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్దల సభలో మంత్రుల తీరు, తొడలు కొట్టడం చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వ్యాఖ్యానించారు. సభలో వీధి రౌడీల్లా ప్రవర్తించిన మంత్రులను సీఎం జగన్ తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తులసీరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-19T20:56:31+05:30 IST