సర్వదర్శనం టోకెన్ల పంపిణీని ప్రారంభించిన టీటీడీ

ABN , First Publish Date - 2020-11-07T17:52:49+05:30 IST

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచిన విషయం తెలిసిందే. ఈ మేరకు తిరుపతి విష్ణు నివాసం

సర్వదర్శనం టోకెన్ల పంపిణీని ప్రారంభించిన టీటీడీ

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచిన విషయం తెలిసిందే. ఈ మేరకు తిరుపతి విష్ణు నివాసం కాంప్లెక్స్‌లో 24 గంటలూ ఉచిత దర్శనం టోకెన్లను నేటి నుంచి టీటీడీ ప్రారంభించింది. రైల్వే స్టేషన్, ఆర్టీసీబస్టాండ్ దగ్గరలో యాత్రీకులకు ఉపయుక్తంగా దర్శనం కౌంటర్‌ను టీటీడీ ఏర్పాటు చేసింది. సర్వదర్శనం టికెట్లను పరిమితంగా మాత్రమే ఇస్తుండటంతో భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ సర్వదర్వనం టోకెన్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2020-11-07T17:52:49+05:30 IST