టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం..

ABN , First Publish Date - 2020-09-03T17:03:05+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.

టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం..

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జరుగుతున్న ఆడిట్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇకపై ఆడిట్‌ను కాగ్ ద్వారా చేయాలని పాలకమండలి జగన్ సర్కార్‌కు సిపార్సు చేసింది. 2014-19 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఇప్పటికే ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. 2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ నిర్వహించినప్పటికీ దీనిపై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని పాలకమండలి ప్రభుత్వాన్ని కోరింది. 


ప్రతి ఏటా స్టేట్ ఆడిట్ ద్వారా సక్రమంగా ఆడిట్ జరుగుతున్నప్పటికీ అనవసర ఆరోపణలు నేపథ్యంలో భక్తులలో విశ్వాసం కల్పించేందుకు గాను కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. అయితే ఈ సిపార్సుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-09-03T17:03:05+05:30 IST