శ్రీవారి లడ్డూల విషయమై టీటీడీ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-03-21T16:43:08+05:30 IST

తిరుమల: లడ్డులను టీటీడీ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఉచితంగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.

శ్రీవారి లడ్డూల విషయమై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: లడ్డులను టీటీడీ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఉచితంగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీటీడీ స్వామివారి దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారు చేసిన లడ్డూలు పాడవకుండా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్కరికీ  10 లడ్డులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతిలోని ఉద్యోగుల విశ్రాంతి సముదాయం వద్ద ఉద్యోగులకు లడ్డులను పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


Updated Date - 2020-03-21T16:43:08+05:30 IST