టీటీడీ ఈవో రేసులో శ్రీవత్స కృష్ణ
ABN , First Publish Date - 2020-03-16T09:43:31+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా కర్ణాటక కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీవత్స కృష్ణను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మూడేళ్ల కాల
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా కర్ణాటక కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీవత్స కృష్ణను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మూడేళ్ల కాల పరిమితి మే మొదటి వారంలో ముగుస్తుండటంతో శ్రీవత్సను డెప్యుటేషన్‌పై రాష్ర్టానికి తీసుకొచ్చి ఈవోను చేయాలని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన శ్రీవత్స 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1994లో ఆయన్ను ఏపీకేడర్‌కు కేటాయించగా, అప్పట్లో హైదరాబాద్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత ప్రపంచబ్యాంకు అసైన్‌మెంట్‌పై వెళ్లారు. అనంతరం విధుల్లోకి తిరిగొచ్చినా ఆయన సతీమణి మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ కావడంతో స్పౌజ్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోగా ఇద్దరినీ కర్ణాటక కేడర్‌కు కేటాయించారు. కర్ణాటకలో పనిచేస్తున్న ఆయనను ఇప్పుడు ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీలక్ష్మి, స్టీఫెన్ రవీంద్ర, రోహిణీ సింధూరి తదితరుల డెప్యుటేషన్ దరఖాస్తులను కేంద్రం పెండింగ్‌లో పెట్టింది.