టీటీడీ సలహాలు స్వీకరించిన షిర్డీ సంస్థాన్

ABN , First Publish Date - 2020-09-07T04:05:29+05:30 IST

షిర్డీ సంస్థాన్ ఆహ్వానం మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ షిర్డీకి వెళ్లారు.

టీటీడీ సలహాలు స్వీకరించిన షిర్డీ సంస్థాన్

తిరుమల : షిర్డీ సంస్థాన్ ఆహ్వానం మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ షిర్డీకి వెళ్లారు. షిర్డీలో దర్శన పునః ప్రారంభం సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షిర్డీ ఆలయ అధికారులకు టీటీడీ చైర్మన్, ఈవో పలు సూచనలను చేశారు. టీటీడీ చేసిన సూచనలను సంస్థాన్ అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా.. కోవిడ్ నివారణకు తిరుమలలో అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని షిరిడి సంస్థాన్ బోర్డు, సీఈవో టీటీడీని కొనియాడారు. త్వరలోనే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ షిరిడిలో దర్శనాన్ని పునః ప్రారంభిస్తామని షిర్డీ సంస్థాన్ అధికారులు టీటీడీకి తెలిపారు. 


కాగా.. ఇవాళ రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతులను టీటీడీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలకు శ్రీవారి శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ ధర్మారెడ్డిలకు స్వామీజీ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ధార్మిక అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానంకు స్వామీజీ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

Updated Date - 2020-09-07T04:05:29+05:30 IST