టీటీడీ క్యాలెండర్లు, డైరీల కొరత...
ABN , First Publish Date - 2020-12-30T15:56:28+05:30 IST
తిరుమల శ్రీవారి క్యాలెండర్లు, డైరీల కోసం భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. అయితే..

తిరుపతి: తిరుమల శ్రీవారి క్యాలెండర్లు, డైరీల కోసం భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం భక్తులు ఒకింత నిరాశకు గురవుతున్నారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కొరత ఏర్పడింది. ఇప్పటికే 12పేజీల క్యాలెండర్, డైరీల విక్రయాలు పూర్తయ్యాయి. నూతన సంవత్సరాదిన భక్తులకు డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో ఉండేది అనుమానమే.