-
-
Home » Andhra Pradesh » TTD ALLOWS TO POSTPONE OR CANCEL TICKETS
-
తేదీల మార్పు.. టికెట్ల రద్దుకు టీటీడీ అవకాశం
ABN , First Publish Date - 2020-03-13T08:46:24+05:30 IST
కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి దర్శనం కోసం మే నెల వరకు ముందస్తుగా బుక్ చేసుకున్న రూ.300 టికెట్లను రద్దు చేసుకునేందుకు, తేదీలు మార్పు చేసుకునేందుకు టీటీడీ...

తిరుమల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి దర్శనం కోసం మే నెల వరకు ముందస్తుగా బుక్ చేసుకున్న రూ.300 టికెట్లను రద్దు చేసుకునేందుకు, తేదీలు మార్పు చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. అలాగే మే నెల వరకు చేసుకున్న ఇతర ఆర్జిత సేవలు, గదుల బుకింగులను రద్దు చేసుకునేందుకు మాత్రమే వీలు కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు కాబట్టి అందరి ఆరోగ్యం కాంక్షించి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు దయచేసి అవి తగ్గిన తరువాతే తిరుమలకు రావాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తిచేసింది.