దళారులపై టీటీడీ కొరడా

ABN , First Publish Date - 2020-10-04T20:27:31+05:30 IST

వీఐపీ బ్రేక్‌ దర్శన దళారులపై టీటీడీ కొరడా ఝుళిపించింది. తిరుమలకు వచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అధికధరలకు విక్రయిస్తున్నారంటూ టీటీడీకి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దళారులపై టీటీడీ కొరడా

తిరుమల: వీఐపీ బ్రేక్‌ దర్శన దళారులపై టీటీడీ కొరడా ఝుళిపించింది. తిరుమలకు వచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అధికధరలకు విక్రయిస్తున్నారంటూ టీటీడీకి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. వీఐపీ సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 39 మంది భక్తుల నుంచి రూ.1.15 లక్షలు దళారులు వసూలు చేసినట్లు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో ఆరుగురు దళారులను  టీటీడీ విజిలెన్స్ పట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

Updated Date - 2020-10-04T20:27:31+05:30 IST