ఇడుపులపాయలో సీఎం జగన్‌

ABN , First Publish Date - 2020-07-08T08:03:10+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడప

ఇడుపులపాయలో సీఎం జగన్‌

  • నేడు వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళి

కడప (ఎర్రముక్కపల్లె) / వేంపల్లె, జూలై 7:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి 4.30 గంటలకు చేరుకున్న సీఎంకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్‌, కలెక్టరు హరికిరణ్‌, ఎస్పీ అన్బురాజన్‌, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌, సుధీర్‌రెడ్డి, రఘురామరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టరులో బయలుదేరి 5 గంటలకు ఇడుపులపాయకు చేరుకోగా అక్కడ జిల్లా అధికారులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పులివెందులకు చెందిన పలువురు నేతలు సీఎంకు వినతిపత్రాలు అందజేశారు. హెలిప్యాడ్‌ నుంచి విశ్రాంతి భవనం వరకు సీఎం నడచుకుంటూ వెళ్లగా, అక్కడ  పోలీసులు గౌరవ వందనం చేశారు.


సీఎం వెంట టీటీడీ చైర్మన్‌ వైవీసుబ్బారెడ్డి వచ్చారు. కాగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జగన్‌ బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో వైఎస్సార్‌ ఘాట్‌లోని తండ్రి సమాధి వద్దకు చేరుకొని నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ విజయలక్ష్మి వైఎస్సార్‌పై రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. అనంతరం ట్రిపుల్‌ ఐటీలో అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.


ట్రిపుల్‌ ఐటీలో ఏర్పాట్లు పూర్తి

ముఖ్యమంత్రి జగన్‌ ట్రిపుల్‌ఐటీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌ కేసీరెడ్డి పర్యవేక్షణలో అభివృద్ధి పనుల ప్రారంభానికి శిలాఫలకాలు ఏర్పాటుచేశారు. క్యాంపస్‌ మధ్యలో వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రూ.139కోట్లతో నిర్మించిన ఏడు డిపార్ట్‌మెంటల్‌ కాంప్లెక్స్‌లను, మూడు మెగావాట్ల సోలార్‌ పవర్‌ సిస్టంను సీఎం ప్రారంభించేందుకు శిలాఫలకాలు ఏర్పాటుచేశారు. 

Updated Date - 2020-07-08T08:03:10+05:30 IST