గిరిజనుల హక్కులు కాపాడండి..: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-06-19T23:04:01+05:30 IST

గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గిరిజనుల హక్కులు, అవకాశాలను కాపాడటానికి తగిన చర్యలు

గిరిజనుల హక్కులు కాపాడండి..: చంద్రబాబు

అమరావతి: గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గిరిజనుల హక్కులు, అవకాశాలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వతంత్ర భారతదేశంలో గిరిజనులెవరూ వారి ప్రగతికి గల అవశాకాలు కోల్పోకూడదన్నారు. రాజ్యాంగ పరిషత్‌లో గిరిజన ప్రతినిధి శ్రీజైపాల్ సింగ్ ముండా ఈ విషయాన్ని పేర్కొన్నారని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. రాజ్యాంగ నిబద్ధత ప్రకారం గిరిజనుల ఎదిగే అవకాశాలను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వానికి అటువంటి నిబద్ధత ఏదీ లేనట్లు కనిపిస్తోందన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిపోయిందని విమర్శలు గుప్పించారు. ఫలితంగా బీసీలు తమ రాజకీయ సాధికారతను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో టీచర్ల ఉద్యోగాలు 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 3ని తీసుకువచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

Updated Date - 2020-06-19T23:04:01+05:30 IST