వీడిన ట్రంక్ పెట్టెల్లో నిధి మిస్టరీ

ABN , First Publish Date - 2020-08-20T21:24:09+05:30 IST

అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ట్రంక్ పెట్టెల్లో నిధి మిస్టరీ వీడింది.

వీడిన ట్రంక్ పెట్టెల్లో నిధి మిస్టరీ

అనంతపురం: సంచలనం రేపిన ట్రంక్ పెట్టెల్లో నిధి మిస్టరీ వీడింది. పెట్టెల్లో దాచిన వెండి, బంగారం, నగదు ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌దిగా పోలీసులు గుర్తించారు. కేసును లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఒక ఇంట్లో ట్రంక్ పెట్టెలో నిలువ ఉంచిన నిధిని పోలీసులు లెక్కించారు. ఆ సొమ్ము ఎవరిదన్నది తేల్చారు. ముగ్గురు డీఎస్పీలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో 8 పెట్టెలు తెరిచారు. 2.4 కిలోల బంగారం, 24 కేజీల వెండి, రూ. 15.55 లక్షల నగదును గుర్తించారు. రూ. 27 లక్షల విలువైన ప్రాంసరీ నోట్లు, రూ. 49 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్ తన దగ్గర పనిచేసే డ్రైవర్ నాగలింగం, మామ అయిన బాలప్ప ఇంట్లో ఈ నిధిని దాచినట్లు పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2020-08-20T21:24:09+05:30 IST