లాంగ్ స్టాండింగ్ ఉన్న టీచర్లకు బదిల్లీల్లో ప్రాధాన్యత: సురేష్
ABN , First Publish Date - 2020-12-11T23:46:37+05:30 IST
లాంగ్ స్టాండింగ్ ఉన్న టీచర్లకు బదిల్లీల్లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. హెడ్ మాస్టర్లకు 5 ఏళ్లు, టీచర్లకు
అమరావతి: లాంగ్ స్టాండింగ్ ఉన్న టీచర్లకు బదిల్లీల్లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. హెడ్ మాస్టర్లకు 5 ఏళ్లు, టీచర్లకు 8 ఏళ్లు ఉంటే బదిలీ చేస్తామని తెలిపారు. 2 ఏళ్లు పూర్తైనవారికి రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం ఇస్తామని సురేష్ పేర్కొన్నారు. మరింత పారదర్శకత కోసమే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. హెచ్‌ఆర్‌ఏ ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించామని, 5 రోజుల పాటు వెబ్ ఆప్షన్ అప్‌డేట్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు. బ్లాక్ చేస్తే తప్ప మారుమూల ప్రాంతాలకు ఎవరూ వెళ్లరని, డిసెంబర్ 16 నుంచి 6 రోజులు లిస్ట్ డిస్‌ప్లే చేస్తామని సురేష్ తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. 40% వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్ ప్రక్రియ అమలు చేయనున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన పోస్టులను రద్దు చేస్తున్నారు.