కృష్ణా జిల్లాలో ఆరుగురు తహసీల్దార్ల బదిలీ

ABN , First Publish Date - 2020-04-28T15:05:49+05:30 IST

కృష్ణా జిల్లాలో ఆరుగురు తహసీల్దార్ల బదిలీ

కృష్ణా జిల్లాలో ఆరుగురు తహసీల్దార్ల బదిలీ

కృష్ణా: జిల్లాలో ఆరుగురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈమేరకు కలెక్టర్ ఇంతియాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవనిగడ్డ తాహసీల్దార్‌ విక్టర్‌‌బాబు గంపలగూడెంకు బదిలీ అవగా, నాగాయలంక తహసీల్దార్‌ వెంకటరామయ్య వీరులపాడుకు బదిలీ చేశారు. అలాగే వీరులపాడు తహసీల్దార్‌గా పనిచేస్తున్న సాయి శ్రీనివాస్‌ నాయక్‌కు విజయవాడ రూరల్‌కు బదిలీ చేశారు. గూడూరు తహసీల్దార్‌ విమల కుమారి నాగాయలంకు బదిలీ అయ్యారు. స్పెషల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మస్తాన్‌ను అవనిగడ్డ తహసీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే విజయవాడ రూరల్‌ మండలం తహసీల్దార్‌ వనజాక్షిని గూడూరుకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-04-28T15:05:49+05:30 IST