తూర్పు గోదావరి జిల్లాలో విషాదం

ABN , First Publish Date - 2020-10-03T16:53:40+05:30 IST

వీఆర్‌పురం మండలం, పొలుసుమామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లాలో విషాదం

తూ.గో.జిల్లా: వీఆర్‌పురం మండలం, పొలుసుమామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిన్న 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో ఓ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన వక్తి ఇచ్చిన తినుబండారాలను తిన్న చిన్నారులు వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో వీఆర్‌పురం ప్రభుత్వ ఆస్పత్రికి చిన్నారులను తరలించారు. అందులో ఐదేళ్ల బాలిక పరిస్థితి విషమంగా మారడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-10-03T16:53:40+05:30 IST