వలి..చేల కనువిందు

ABN , First Publish Date - 2020-11-26T09:01:50+05:30 IST

పచ్చదనంతో పరవశింపజేసే మన్యానికి పసుపు తోరణం కట్టినట్టుండే వలిసె పూల సోయగాలు ప్రస్తుతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కనిపించే ఈ వలిసెలు ఏజెన్సీ అందాలకు

వలి..చేల కనువిందు

అనంతగిరి (విశాఖపట్నం జిల్లా) : పచ్చదనంతో పరవశింపజేసే మన్యానికి పసుపు తోరణం కట్టినట్టుండే వలిసె పూల సోయగాలు ప్రస్తుతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కనిపించే ఈ వలిసెలు ఏజెన్సీ అందాలకు సరికొత్త సొబగులు అద్దుతాయి. ఇక.. వలిసె గింజల నుంచి నూనె తీస్తారు. అయితే ఏజెన్సీలో ఒకప్పుడు విస్తారంగా పండించే ఈ పంటను ఆకాశపందిరి అనే కలుపు మొక్కలు దెబ్బతిస్తుండడంతో పాటు ఐటీడీఏ మార్కెటింగ్‌ సదుపాయాన్ని కల్పించకపోవడంతో క్రమేపీ సాగుచేసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇక.. ఈ ఏడాది కరోనా ప్రభావంతో వలిసెల సాగు విస్తీర్ణం తగ్గింది.

Updated Date - 2020-11-26T09:01:50+05:30 IST