మాములొళ్లు కాదు.. టమోట లారీ దోపిడీ.. పల్టీలు కొట్టడంతో..
ABN , First Publish Date - 2020-09-14T22:45:08+05:30 IST
ఓ లారీ డ్రైవర్‌ను దొంగలు బెదిరించారు. కత్తి చూపించి, లారీ నుంచి దింపేశారు. టమోట లోడ్ లారీ తీసుకొని ఉడాయించారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన వేణుగోపాల్... లారీలో టమోటా లోడుతో వెళుతున్నారు. పుంగనూరు మార్కెట్ నుంచి చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కి వెళ్ళాల్సి ఉంది. అయితే పలమనేరు రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద ఆర్టీవో అధికారులమంటూ ముగ్గురు దుండగులు లారీని అడ్డగించారు.
చిత్తూరు : ఓ లారీ డ్రైవర్‌ను దొంగలు బెదిరించారు. కత్తి చూపించి, లారీ నుంచి దింపేశారు. టమోట లోడ్ లారీ తీసుకొని ఉడాయించారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన వేణుగోపాల్... లారీలో టమోటా లోడుతో వెళుతున్నారు. పుంగనూరు మార్కెట్ నుంచి చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కి వెళ్ళాల్సి ఉంది. అయితే పలమనేరు రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద ఆర్టీవో అధికారులమంటూ ముగ్గురు దుండగులు లారీని అడ్డగించారు.
కత్తులతో బెదిరించి టమోటా లోడుతో సహా లారీని తీసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్ళాం... డ్రైవర్‌ను దించేసి లారీతో సహా అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే వేణు... పోలీసులకు సమాచారమందించాడు. కాగా... లారీతో సహా పరారైన దోపిడీ దొంగలు... పారిపోయే క్రమంలో వేగంగా నడిపారు. దీంతో లారీ ప్రమాదానికి గురైంది.
అతివేగంగా వెళ్లడంతో లారీ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. లారీ ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో పోలీసులకు టమోటా లోడు లారీ బోల్తా కొట్టిందని తెలిసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ మాత్రమే కనిపించడంతో వారు పరారయ్యారని తెలుసుకున్నారు. ఆ ముగ్గురు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
జిల్లాలో జరిగిన ఈ దొంగనతం చర్చనీయాంశమైంది. కాగా ఈ సంఘటనలో... టమోటలు నేలమట్టమయ్యాయి. సరుకు నాశనం కావడంతో లారీ కూడా దెబ్బతిందని డ్రైవర్ కమ్ ఓనర్ వేణుగోపాల్ వాపోయారు.