ప్రకాశం జిల్లాలో సర్వం బంద్

ABN , First Publish Date - 2020-03-23T12:58:26+05:30 IST

ప్రకాశం: నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలో సర్వం బంద్ కానున్నాయి.

ప్రకాశం జిల్లాలో సర్వం బంద్

ప్రకాశం: నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలో సర్వం బంద్ కానున్నాయి. లాక్‌డౌన్‌ అమలు కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌‌ను అమలు చేస్తూ  జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.


కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ప్రయివేట్ వాహనాలు సహా పూర్తిగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోనుంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ బంద్ కానున్నాయి. అత్యవసర, నిత్యావసరాలకు మాత్రమే అధికారులు అనుమతివ్వనున్నారు.


Updated Date - 2020-03-23T12:58:26+05:30 IST