నేడు, రేపు వర్షాలు

ABN , First Publish Date - 2020-10-03T07:27:22+05:30 IST

ఒడిసా-ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలో వాయువ్య, ప శ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరం గా కొనసాగుతోంది.

నేడు, రేపు వర్షాలు

అమరావతి/విశాఖ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఒడిసా-ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలో వాయువ్య, ప శ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరం గా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శుక్రవారం అక్కడక్క డ తేలికపాటి వర్షాలు కురిశాయి.


శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. 

Updated Date - 2020-10-03T07:27:22+05:30 IST