పొగాకు రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: కన్నబాబు

ABN , First Publish Date - 2020-06-19T03:18:48+05:30 IST

పొగాకు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోళ్లు

పొగాకు రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: కన్నబాబు

అమరావతి: పొగాకు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేస్తామని ప్రకటించారు. పొగాకు ఉత్పత్తి కంపెనీలకు ప్రభుత్వమే పోటీగా నిలుస్తుందన్నారు. కొనుగోళ్ల లైసెన్సును ప్రభుత్వమే తీసుకునే విధంగా ప్రక్రియ మొదలుపెట్టామని, పొగాకు కొనుగోళ్లలో 920 మంది లైసెన్సుదారులున్నారని తెలిపారు. వేలంలో పాల్గొనేవారిపై ఫోకస్‌ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. కంపెనీలు కుమ్మక్కై రేటు పడిపోయేలా చేస్తున్నారని, వేలంలో పాల్గొనని గుర్తింపు రద్దు చేయాలని సూచించారని తెలిపారు. పొగాకు రైతులకు క్రాప్‌ హాలీడే ప్రకటించే పరిస్థితి రాకూడదని కన్నబాబు చెప్పారు.


Updated Date - 2020-06-19T03:18:48+05:30 IST