ఆత్మహత్యకు అనుమతించాలంటూ హైకోర్ట్‌కు ఓ కుటుంబం లేఖ

ABN , First Publish Date - 2020-09-03T16:48:08+05:30 IST

ప్రకాశం జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి కోసం గవర్నర్‌తలోపాటు హైకోర్టుకు లేఖ రాసింది.

ఆత్మహత్యకు అనుమతించాలంటూ హైకోర్ట్‌కు ఓ కుటుంబం లేఖ

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి కోసం గవర్నర్‌తో పాటు హైకోర్టుకు లేఖ రాసింది. గ్రామంలో తమను వెలివేసి ఏడాది దాటినా అధికారులు పట్టించుకోవడంలేదని లేఖలో ఆదేదన వ్యక్తం చేసింది. ఆత్మహత్య చేసుకోడానికి కుటుంబం మొత్తం అనుమతి కోసం లేఖ రాయడం జిల్లాలో కలకలం రేగింది.

‘‘గ్రామంలో మా కుటుంబాన్ని వెలివేశారు. మాతో ఎవరూ మాట్లాడడంలేదు. మాతో ఎవరైనా మాట్లాడితే రూ. 10వేలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు గ్రామస్తులను హెచ్చరించారు. మీరే మా కుటుంబాన్ని కాపాడాలంటూ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని పుష్ప సీఎం జగన్‌కు ఏడాది క్రితం లేఖ రాసింది’’. చిన్నారి లేఖపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన ముఖ్యమంత్రి విచారణ జరపాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. అందరూ కలిసి ఉండాలని సూచించారు. అయినా ఆ గ్రామస్తుల్లో మార్పు రాలేదు.

Updated Date - 2020-09-03T16:48:08+05:30 IST