తిరుమలలో విమానం వెళ్లిన మాట వాస్తవమే: వీజీవో లక్ష్మీమనోహర్
ABN , First Publish Date - 2020-09-21T00:22:50+05:30 IST
తిరుమలలో విమానం వెళ్లిన మాట వాస్తవమేనని వీజీవో లక్ష్మీమనోహర్ స్పష్టం చేశారు. నావిగేషన్‌కు సంబంధించిన విమానం తిరుమల గగనతలంలో ..

తిరుమలలో విమానం వెళ్లిన మాట వాస్తవమేనని వీజీవో లక్ష్మీమనోహర్ స్పష్టం చేశారు. నావిగేషన్‌కు సంబంధించిన విమానం తిరుమల గగనతలంలో వెళ్లిందని ఆయన తెలిపారు. సిగ్నల్స్ చెక్ చేసుకోవడానికి ఏడాదిలో రెండు, మూడు సార్లు నావిగేషన్ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయన్నారు. శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్లలేదని లక్ష్మీమనోహర్ చెప్పారు. సీఆర్వో కార్యాలయం మీద సుమారు 5 వేల అడుగుల ఎత్తులో విమానం వెళ్లిందని పేర్కొన్నారు. డీజీసీఏ అధికారులను ఫోన్‌లో సంప్రదించామని లక్ష్మీ మనోహర్ స్పష్టంచేశారు.