తిరుపతి: ప్రభుత్వ మద్యం షాపులో దోపిడీ
ABN , First Publish Date - 2020-04-28T18:26:28+05:30 IST
తిరుపతి: ప్రభుత్వ మద్యం షాపులో దోపిడీ

తిరుపతి: నగరంలోని అవిలాల సుబ్బయ్యనగర్ సమీపంలో గల ప్రభుత్వ మద్యం షాపులో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గత అర్ధరాత్రి కాపాలాగా ఉన్న వాచ్‌మెన్‌ను కట్టేసిన దుండగులు...ఆపై షాపులోని మద్యం బాటిళ్లను దోచుకెళ్లారు. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని దోపిడీ ఘటనపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.