మరో మోసానికి పాల్పడ్డ సృష్టి ఆస్పత్రి అధినేత డాక్టర్ నమ్రతా

ABN , First Publish Date - 2020-08-12T18:34:20+05:30 IST

సృష్టి బేబి ఆసుపత్రి అధినేత డాక్టర్ నమ్రతా చేసిన మరో మోసం వెలుగులోకి వచ్చింది.

మరో మోసానికి పాల్పడ్డ సృష్టి ఆస్పత్రి అధినేత డాక్టర్ నమ్రతా

తిరుపతి: సృష్టి బేబి ఆసుపత్రి అధినేత డాక్టర్ నమ్రతా చేసిన మరో మోసం వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన రిటైర్డ్ టీచర్ మల్లికార్జున దంపతులకు డాక్టర్ నమ్రతా భూమి అమ్మారు. కర్నాటక రాష్ట్రం చిక్ బల్లాపూర్‌లో ఒక ఎకరా 35 గుంటల భూమికి అడ్వాన్స్‌గా రూ.27లక్షలను తీసుకున్న డాక్టర్ నమ్రతా... భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసానికి పాల్పడ్డారు. 2008 సంవత్సరంలో ఘటన చోటు చేసుకుంది.  దీంతో మోసపోయిన మల్లికార్జున దంపతులు...డాక్టర్ నమ్రతపై చిక్ బల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే భూమిని డాక్టర్ నమ్రతా మరొకరికి జీపీఏ చేసి అమ్మారని...తమను మోసం చేశారంటూ రిటైర్డ్ టీచర్ మల్లికార్జున దంపతులు కోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2020-08-12T18:34:20+05:30 IST