యూట్యూబ్‌లో చూసి నాటుసారా తయారీ... యువకుడి అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-12T16:59:21+05:30 IST
యూట్యూబ్ లో చూసి నాటుసారా తయారుచేస్తున్న బిటెక్ చదివిన యువకుడిని తిరుపతి ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతి: యూట్యూబ్‌లో చూసి నాటుసారా తయారుచేస్తున్న బీటెక్ చదివిన యువకుడిని తిరుపతి ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. సీసాల్లో నింపిన 70 లీటర్ల నాటుసారాయి, 400 లీటర్ల నాటుసారాయి ఊటతో పాటు 44 లీటర్ల కర్ణాటక మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పాకాల మండలం తోటపల్లికి చెందిన మఠవలం వంశీకృష్ణరెడ్డి (29)అనే యువకుడు వెస్ట్ రైల్వే స్టేష ఎదురుగా ఉన్న పద్మావతీ నగర్‌లో కుటిర పరిశ్రమగా నాటుసారాను తయారు చేస్తున్నాడు. విషయం తెలిసిన తిరుపతి అర్బన్ ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్ ధీరజ్ రెడ్డి అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని నాటుసారాయి బట్టి పరికరాలను సీజ్ చేశారు.