ఏబీఎన్ ఎఫెక్ట్: హథీరాంజీ మఠం భూ వివాదంలో 14మందిపై కేసు
ABN , First Publish Date - 2020-08-22T14:09:37+05:30 IST
జిల్లాలోని ఉప్పరపల్లె హథీరాంజీ మఠం భూ వివాదంలో 14 మందిపై ఎంఆర్‌పల్లె పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుపతి: తిరుపతిలోని ఉప్పరపల్లె హథీరాంజీ మఠం భూ వివాదంలో 14 మందిపై ఎంఆర్‌పల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. మఠం భూవివాదంలో కడప గ్యాంగ్ హల్‌చల్‌పై ఏబీఎన్‌లో కథనం ప్రసారమైంది. బాధితురాలు లత కుటుంబానికి భూ హక్కు ఉన్న భూమిని కబ్జా చేసేందుకు కడప జిల్లా గ్యాంగ్ ప్రయత్నించింది. అయితే బాధితురాలు లత ఫిర్యాదుతో 14 మందితో పాటు మరికొందరిపై ఎంఆర్‌పల్లె పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు.