తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. దీంతో
ABN , First Publish Date - 2020-06-26T03:44:01+05:30 IST
కరోనా కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం...

తిరుమల: కరోనా కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు నిత్యం కిటకిటలాడిన తిరుమలకొండపై ఇప్పుడు ఆస్థాయిలో భక్తులు కనిపించడంలేదు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా తగ్గింది. గురువారం వెంకన్న హుండీ ఆదాయం రూ. 88 లక్షలు వచ్చినట్లు టీటీడీ స్పష్టం చేసింది. గురువారం శ్రీవారిని 11,493 మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపింది. 2903 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ప్రకటించింది.