తిరుమలలో రెండో రోజు ప్రయోగాత్మక దర్శనాలు
ABN , First Publish Date - 2020-06-09T15:26:03+05:30 IST
తిరుమలలో రెండో రోజు ప్రయోగాత్మక దర్శనాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో రోజు ప్రయోగాత్మక దర్శనాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నారు. అలాగే రేపు తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నారు. తిరుమల స్థానికులకు ఉదయం 8 నుంచి దర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. ఈనెల 11 నుంచి భక్తులందరినీ టీటీడీ అనుమతించనుంది. రోజుకు 6 వేల మందికి తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం కలుగనుంది. రూ.300 టిక్కెట్లు ఇప్పటికే 3వేలు ఆన్‌లైన్‌లో విక్రయం జరిగాయి. మరో 3వేల ఉచిత టైమ్‌స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈనెల 11న దర్శనానికి రేపు ఉదయం ఉచిత టైమ్‌స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నారు. రేపటి నుంచి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్ల జారీ చేయనున్నారు. రేపు ఉదయం 5 నుంచి శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది.