శ్రీవారి ఆలయంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు: ఈవో

ABN , First Publish Date - 2020-04-05T23:09:19+05:30 IST

శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్ అన్నారు.

శ్రీవారి ఆలయంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు: ఈవో

తిరుమల: శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్ అన్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. శ్రీవారికి అన్ని కైంకర్యాలను శాస్త్రోక్తంగా ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా నేపధ్యంలో ఉద్యోగులకు సెలవులు ఇచ్చామని ,నిత్యావసర విభాగాల ఉద్యోగులను మాత్రమే వినియోగించుకుంటున్నామని చెప్పారు. పద్మావతి ఆసుపత్రిలో కరోనా చికిత్సకు వైద్య పరికరాల కోసం 19 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. పద్మావతి ఆసుపత్రికి ఇంకా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని టీటీడీ ఈవో పేర్కొన్నారు.

Updated Date - 2020-04-05T23:09:19+05:30 IST