ముత్యపు కవచంలో మలయప్ప అభయం

ABN , First Publish Date - 2020-06-06T10:07:53+05:30 IST

వారి జ్యేష్ఠాభిషేకాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ముత్యపు కవచంలో అభయమిచ్చారు. ఉదయం 7.30 గంటలకు మలయప్పస్వామి ఉత్సమూర్తులను ఆలయంలోని సంపంగి ప్రాకారానికి

ముత్యపు కవచంలో మలయప్ప అభయం

తిరుమల, జూన్‌ 5: శ్రీవారి జ్యేష్ఠాభిషేకాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ముత్యపు కవచంలో అభయమిచ్చారు. ఉదయం 7.30 గంటలకు మలయప్పస్వామి ఉత్సమూర్తులను ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు, వేదపారాయణదారులు మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం 9 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు అభిదేయక అభిషేకం చేపట్టారు. సాయంత్రం మలయప్పస్వామికి ముత్యపుకవచం సమర్పించారు. కాగా, చివరి రోజైన శనివారం శ్రీవారికి బంగారు కవచాన్ని సమర్పించనున్నారు.

Updated Date - 2020-06-06T10:07:53+05:30 IST